Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దివ్యభోజనమై వస్తున్నాను
జీవాహారమై వస్తున్నాను
ఆత్మభోజనమై వేంచేస్తాను
ఆప్తునిగా నీలో నివసిస్తాను
అంతరంగాన్నిఅలకరించుకో
ఆత్మజీవాన్ని నీలో నింపుకో
1 వ చరణం..
పరమ తండ్రి ప్రేమను తెస్తున్నాను
పరమ పావనాత్మను కురిపిస్తాను
ప్రేమ భాష్యములతో సంభాషిస్తాను
నాపావనచిత్తాన్ని నీలో నెరవేర్చదను ||2|| ||అంత||
2 వ చరణం..
కల్వరిగిరి ఫలములతో దీవిస్తాను
అమరలోక విందును చవిచూపిస్తాను
నా రక్త ప్రోక్షణముతో రక్షింస్తాను
నా మహిమలో నీకు చోటిస్తాను ||2|| ||అంత||
3 వ చరణం..
జీవనదినై నీలో ప్రవహిస్తాను
జీవనశక్తిని నీకిల కలిగిస్తాను
అంతిమదినమున నిన్నుఆదరింతును
పరలోకభాగ్యమును ఒనగూర్చెదును ||2|| ||అంత||