Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దివ్యమైన నవ్యమైన - జీవవిందు
పరమును చేర్చెడి - నిత్యవిందు ||2||
ప్రేమమయుడు స్ధాపించిన - ప్రేమవిందు
ఆది దేవుని సన్నిధి చేర్చే - దివ్యవిందు ||2|| llదివ్యll
1 వ చరణం..
మానవులను విమోచించు - పరమవిందు
మరియసుతుని శిలువబలి - జ్ఞాపికవిందు ||2||
ప్రభుయేసుని ఆహ్వానం - స్వీకరించి
కదలిరండి ఆరగించ - క్రీస్తు సంఘమా ... ||2|| llదివ్యll
2 వ చరణం..
పాపశాప ప్రక్షాళన - పుణ్యవిందు
మృత్యుంజయ ప్రసాదమే - మోక్షవిందు ||2||
ప్రభుయేసుని ఆహ్వానం - స్వీకరించి
కదలిరండి ఆరగించ - అమరవిందు ||2|| llదివ్యll