Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సాకీ దివ్యమైన విందు... ధన్యమైన
విందు...రమ్య మైన విందు....
నా యేసు ప్రేమ విందు...
నా యేసు ప్రేమ విందు
ప|| దివ్యమైన విందు... ధన్యమైన విందు
రమ్యమైన విందు... నా యేసు ప్రేమ విందు
మానవాళి విందు - మధురమైన విందు
అమర రుచుల విందు - స్వర్గ సిరుల విందు
తరలి రండి భక్తులారా
కదలి రండి స్నేహితులారా ||దివ్యమైన||
1. నిత్యజీవమిచ్చే శ్రీ క్రీస్తు త్యాగ విందు
సత్యపధము చూపె మనకు
యేసు స్నేహవిందు
మోక్షపురిని చేర్చే ఈ అమర జీవి విందు
ఆత్మ బలము కూర్చి మనల
సేద తీర్చు విందు
మదినేలే స్నేహితుడే మన శాంతి దాతలే
భువినేలే ప్రియ విభుడే మన కాంతి
బాటలే ||తరలి రండి|| ||దివ్యమైన||
2. బాధలెన్ని ఉన్నా ఓదార్పు నిచ్చు విందు
వ్యాధులెల్ల బాపే ప్రభుని అమర ప్రేమ విందు
మరణ బారి నుండి రక్షించు జీవ విందు
మానవత్వ సుధలు చిలికె విశ్వమూర్తి విందు
జగమేలే రక్షకుడే జన బాధ తీర్చులే
ధరనేలే ప్రభు యేసే మన పాలి దీపమే
||తరలి రండి|| ||దివ్యమైన||