Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దివ్యజ్యోతి వెలిగింది నవ్యకాంతి విరిసింది
మహోన్నత స్థలములలో దైవమహిమే కలిగింది
దైవకుమారుని నరావతారం
మానవ జాతికి మహొపకారం
1 వ చరణం..
ఆదిమనుజుని పాపం ఆరని తీరని శాపం
దేవుని ప్రేమకు గాయం ఇలలోనరులకు ఖేదం
దేవుని కరుణ పొంగగ మానవ జాతికి పండుగ
దైవకుమారుని
2 వ చరణం..
ఆదిలోవాక్యం జీవం సర్వసృష్టికి మూలం
ఆదిదేవుని రూపం ఇలలో వెలిసిన సత్యం
దేవుని ప్రేమ మెండుగ ఈ ధరయంతా నిండగ
దైవకుమారుని