Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
జ్ఞాన నాదాలు మేళవించగ పల్లవించెను ప్రభాత వేదం
ఆలకించుడి ఓ ప్రజలారా - యేసునాధుని ప్రేమ సుబోధం
అల్లెలూయ... అల్లెలూయ... అల్లెలూయ....
1. ఝుంటితేనెనే మరిపించును మధుర సుధల శుభ సంచరితము
మానవాళికై మలిచిన వరము - అమరం అమరం ప్రభుహిత వచనం
అల్లెలూయ .... అల్లెలూయ... అల్లెలూయ...
2. అంతరంగమును గ్రహించును తండ్రి దేవుని శుభ చరితము
దీనజనులకై వెలసిన ఫలము కరుణామృతము మధుర ప్రబోధం
అల్లెలూయ.... అల్లెలూయ... అల్లెలూయ...