Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
జీవన కుసుమాలను దోసిటపట్టి
నీ అర్పణచేయగ నిలిచాను దేవా
తోసివేయక అందుకో దేవా
నా అర్పణను (నా యేసుదేవా) ||2||
1 వ చరణం.. నీ పూజకు పూవుగా నీ పీఠపు ప్రమిదగ
తనువు మనసు అర్పించెద స్వీకరించుదేవా
నా పాపములన్నియు క్షమియించు దేవా
చిరుకానుకలు చేకొనుదేవా చేకొనుదేవా ||జీవన||
2 వ చరణం.. నీ పాదధూళితో జీవితం తరించగ
నా జీవన పుష్పములు అర్పించెదదేవా
త్రోసివేయక స్వీకరించు దేవా
చిరుకానుకను ఆశీర్వదించు దేవా ||జీవన||