Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. జ్ఞానమునకు అధిపతి నా యేసయ్యా
నీ జ్ఞానముతో నన్ను నడుపుమయా
ఆరాధన-ఆరాధన యేసయ్యా నీకేఆరాధన ||2|| ||జ్ఞా||
1 సాలోమాను రాజునకు జ్ఞాన మిచ్చినావే
అన్నింటిని అర్ధం చేయు కృపనిచ్చినావే ||2||
అబ్బా నే నీ బిడ్డను ||2||
అన్నింటిని అర్ధం చేయ కృపనీయుమా ||2||
2 పనికి రాని రాయని పారవేసిన రాయిని
ఇంటికి మూలరాయిగా మార్చే ప్రభు నీవేగు|2||
అబ్బా నే నీ బిడ్డను ||2||
ఆశ్చర్యకరమైనవి నీదు కార్యములే
ఆశ్చర్యకరమైనవి ప్రభూ నీదు కార్యముల ||జ్ఞా||