Type Here to Get Search Results !

జగద్రక్షకా జగన్నాయకా ( jagadhrakshaka jaganayaka Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P 

Music: Naveen M 

Album: యేసే నా ఆశ - 7 


సా: ఓ! జగదేక దివ్య మహిమోజ్యల రూప! కృపాప్రదీప! 

ధాత్రి జన రక్షణార్ధ మరుదెంచిన ప్రేమ స్వరూప! 

స్వాగతం... స్వాగతం... సుస్వాగతం... 

జగద్రక్షకా జగన్నాయకా-జగత్పోషకా జగముల నాయకా (2) 

ఈ మానవాళిని రక్షింప - జన్మించిన బాలుడా (2) 

నీ రూపమే నీ ప్రేమయే - జగతికి ఆధారము 


1. పరలోకంలో దూతావళి- అమృత గీతాలు పాడుచుండగా (2) 

హాయిగా బంగారు సింహాసనముపై - ఆశీనుడయ్యే దేవా

 మాకొరకై పశుల తొట్టెలో - పవళించిన దేవా (2) 

రావయ్య ఓ బాలయేసువా (మా యేసు రాజా) 

దీవించయ్య మా బాలయేసా (మా క్రీస్తు రాజా) ||జగద్ర||



2. పశుపాకలో పసిపాపగా దేదీప్యమానముగా మెరిసిపోవగా (2) 

ముద్దుగా నీ దివ్య ముఖారవిందము గాంచి - 

మైమరచి ఉప్పొంగిపోవగా (2) మా పాప ప్రక్షాళన చేయుమా (2) ||జగద్ర||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section