Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. జై జై యేసురాజా జై జై-
రాజాధి రాజా నీకే జై జై
1. పాప కూపములో పడియున్న
నన్ను జూచి చేయిజాచి
చక్కగ దరికి జేర్చితివి ||జై||
2. సిలువ రక్తములో నన్ను కడిగి
పాపమంత పరిహరించి
పావనుడగు నా ప్రభు యేసు ||జై||
3. మంటి పురుగు నైన నన్ను
మంటి నుండి మింట జేర్చిన
మహా ప్రభుండ నీకే జై ||జై||
4. నీతి హీనుడనైన నాకు
నీతి రక్షణ వస్త్రములను
ప్రీతితో నొసగిన నీతి రాజా ||జై||