Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
జన్మించే యేసు జన్మించే
వెలుగొందెనొక దివ్య తార
ఉదయించె క్రీస్తు ఉదయించే
దావీదు పురమందున
సర్వోన్నతమైన స్థలములో
దేవునికే మహిమయూ
కలుగును నరులకు పుడమిపై
శాంతి సమాధానము ||జన్మించే||
1. మనుజుల రక్షింపను
మనుజావతారుండయేసు
మరియమ్మకు సుతుడాయెను
మన మధ్య నివసించెను ||జన్మించే||
2. చెదరిన గొర్రెలను
చేర్చును కనికరముతో
శుభవార్తతో దీనులను
నడిపించు తన ప్రేమతో ||జన్మించే||