Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
జయ యేసు నాధా- జయ యేసు నాధా
జయమా జయమా - జయ యేసు నాధా
1:-
సుతుడైన స్వామీ – సతతము మిమ్ము
గతియని నమ్మి – నుతియింతు దేవా ||జయ||
2:-
దావీదు రాజు శ్రీ వంశ ధీరా
దాక్షిణ్య కారా –దైవ కుమారా ||జయ||
3:-
అమిత ప్రతాపా – సుమిత ప్ర పూజా
సతత ప్రకాశ – సామ్రాజ్య తేజా ||జయ||
4:-
అరమర లేక – స్థిరముగ మిమ్ము
కరుణాల వాలా-కొలిచెద దేవా ||జయ||
5:-
మరియమ్మ పుత్రా – మహానీయగాత్రా
మాపాలి దేవా – మమ్మేలు కోవా ||జయ||