Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
జీవాహారము - ప్రభు దేహము
జీవజలము - ప్రభు రక్తము ||2||
పరుగున రండి-వేగమే రండి ||2||
ప్రీతితో దేవుని లో కొందము ||2|| ||జీవా||
1. ఫలమైనదీ విందు-పరిపూర్ణ బలివిందు
మనుజాళి రక్షించు-స్థిర విందుగా ||2||
ఆత్మల దాహము చల్లార్చు విందు
ఆత్మానందము కలిగించు విందు ||2||
పావన చరితుని ప్రోక్షణ విందు
పరుగున రండి-వేగమే రండి ||2||
ప్రీతితో దేవుని లో కొందము ||2|| ||జీవా||
2. ఆత్మాభిషేకము కురిపించు ఈ విందు
మన వ్యాధి బాధను తొలగించగా ||2||
అనుదిన జీవిత మార్గములందు
ఆ ప్రభు యేసుని నీడలయందు ||2||
ప్రేమతో నడిపిన పానవ విందు
పరుగున రండి-వేగమే రండి ||2||
ప్రీతితో దేవుని లో కొందము ||2|| ||జీవా||