Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
జీవాహారము భుజియించ ` జీవజలము సేవించ
జగేదక దేవుని స్మరియించ ` జనులారా వేగమే రారండీ
1 వ చరణం..
అనాడు ప్రభుయేసు స్థాపించిన
అపురూప అనురాగ విందే ఇది
మనసార మనుజాళి పాలించగ ||2||
మహిలోన విలసిల్లు విందే ఇది llజీవాll
2 వ చరణం..
ప్రభురక్త ధారల ప్రభవించిన
విధువైన ప్రియ సంఘ విందే ఇది
పరమార్థసాధక వరవాహిని ||2||
పరిశుద్ధ ఫలదాత పొందే ఇది llజీవాll