Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సంగమం-10
ప. జీవము నిచ్చిన పరమపిత
నీకే స్తుతి ఆరాధన ||2||
రక్తంచింది రక్షించిన యేసు
క్రీస్తా ఆరాధన బలపరచి నన్ను
దృఢపరచు పరిశుద్దాత్మ ఆరాధన
ఆరాధన....ఆరాధన
1. నాలో వున్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక
నేను పొందిన రక్షణ
నీవు చేసిన త్యాగము
మరువను నిన్ను యేసయ్యా
మరవను నీదు ప్రేమను
మరువను నిన్ను యేసయ్యా
మరువను నీదు త్యాగము
జీవించినా మరణించిన యిక
నీ కోసమే యేసయ్యా
ఆరాధన...ఆరాధన...ఆరాధన
2. జీవమెసగు వాక్కుచే
అనుదినం నన్ను పోషించు
నీదు బాటలో
పయనింప దారిని
నాకు చూపించు
చాలును నాకు నీ కృప నిత్యము
నేను జీవించెద
జీవించినా మరణించినా యిక
నీ కోసమే యేసయ్యా
ఆరాధన...ఆరాధన... ఆరాధన