Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సంగమం-14
ప. జీవనదిని నాహృదయములో
ప్రవహింప చేయుమయా
1. ఎండిన ఎముకలన్నీ మళ్ళీ
జీవింప చేయుమయా
నీ శ్వాసను ఊది నీశక్తితో లేపుమయా ||జీ||
2. శరీర వాంఛలన్నీ నాలో
నశింప చేయుమయా
నీ ఆత్మ కార్యములు నాలో
జరిగింప చేయుమయా
3. బలహీన సమయములో
నీ బలము ప్రసాదించు
నీకృప చాలునయ్యానే
నిరతము జీవింప ||జీ||
4. ఆత్మీయ వరములతో
నన్ను అభిషేకం చేయుమయా
నీ సాక్షిగా మలచి
నీయందే జీవింపనిమ్మా ||జీ||