Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
జీవితమంతా నీ ప్రేమ గానము
ప్రణుతింతుమో దేవ దేవా
ప్రణుతింతు మేము నీ కీర్తనల్
ఆనంద గానంబుతో
1:-
సర్వ సమయములలో నీ స్తుతిగానం
ఎల్లవేళల యందు నీ నామ ధ్యానం ll2ll
మా కదియే మేలు ఈ జీవితమునా
స్తుతింతుమో రక్షకా ll జీ ll
2:-
సృష్టి నంతటిని నీ వాక్కు చేత
సృజించితివిగా మా దేవ దేవా
నీ ఘనమగు మహిమ వర్ణింపతరమా
స్తుతింతుమో రక్షకా ll జీ ll
3:-
కలుషాత్ములమైన మా కొరకు నీవు
విలువైనా ప్రాణము నర్పించితివిగా
కల్వరిగిరిపై చూపిన ప్రేమ
స్తుతింతుమో రక్షకా ll జీ ll