Type Here to Get Search Results !

జేసుని కొరకై ఇల జీవించెద ( jesuni korakai Ila jeevinchedha Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


జేసుని కొరకై యిల జీవించెద - 

భాసురముగ నే ననుదినము 

దోషములన్నియు బాపెను మోక్ష - 

నివాసమున ప్రభు జేర్చునుగా


1. నాశనకరమగు గుంటలోనుండియు - 

మోసకరంబగు యూబినుండి

నాశచె నిలపై కెత్తెను నన్ను - 

పిశాచి పధంబున దొలగించెను


2. పలువిధముల పాపంబును జేసితి - 

వలదని ద్రోసితి వాక్యమును

కలుషముబాపెను కరుణను బిలిచెను - 

సిలువలో నన్నాకర్షించెన్ 


3. అలయక సొలయక సాగిపోదును - 

వెలయగ నా ప్రభు మార్గములన్

కలిగెను నెమ్మది కలువరి గిరిలో - 

విలువగు రక్తము చిందించిన ప్రభు


4. శోధన బాధలు శ్రమలిల కలిగిన - 

ఆదుకొనును నా ప్రభువనిశం

వ్యాధులు లేములు మరణము వచ్చిన - 

నాధుడే నా నిరీక్షణనగున్


5. బుద్ది విజ్ఞాన సర్వ సంపదలు - 

గుప్తమైయున్నవి ప్రభునందు

అద్భుతమగు ప్రభువన్నియు వొసగి - 

దిద్దును నా బ్రతుకంతటిని


6. అర్పించెదను ధన ప్రాణమునకై - 

రక్షించెను నా ప్రియ ప్రభువు

అర్పింతును నా యావజ్జీవము -

రక్షకుడేసుని సేవింప 


7. యవ్వన జనమా ఇదే సమయము - 

యేసుని చాటగ రండి

పావన నామము పరిశుద్ద నామము - 

జీవపు మార్గము ప్రచురింపన్


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section