Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
జీవితమంతా నీ కర్పింతును
జీవన బలిగా చేకొను తండ్రి
1 వ చరణం..
నే నిల పొందిన కానుకలన్నీ
నీకే సొంతం కాదా స్వామి
నాదగు జీవము హృదయము వెతికే ll2ll
నాధుడు నీవేకాదా స్వామిll జీవి ll
2 వ చరణం..
నీదగు కరుణా రసమును గ్రోలి
వందన మొసగా చేరితి స్వామి
పొందిన ప్రేమ కలిమి చెలిమి ll2ll
నీదకు వరములు కావా స్వామిll జీవి ll
3 వ చరణం..
నీ ప్రియ పిలుపును పొందిన వారిని
నీతో నిలువగ జేయుము దేవా
జీవనదాతవు పావన నేతవు ll2ll
నీవని నమ్మగ దీవెన లీవాll జీవి ll