Lyrics: Fr. Gnanam SDB
Tune: Fr. Gnanam SDB
Music: Naveen M
Album: ప్రణతులు -2
సాకి : శరణం శరణం సహాయమాతా
శరణం శరణం
మా అమ్మా మరియమ్మ
సహాయమాతవు నీవమ్మా
శరణం శరణం రావమ్మా
కరుణతో బ్రోవుము మరియమ్మ ||మా||
1. భక్తుల మదిలో ఆశవు నీవు
వేడిన వారికి నీడవు నీవు ||2||
తనయుని ప్రేమగ ప్రార్ధించి ||2||
వరముల నొసగుము మరియమ్మా ||మా||
2. ప్రేమను పంచే మాతవు నీవు
పాపుల బ్రోచే అమ్మవు నీవు ||2||
నిరతము తోడుగ నీవుండి ||2||
కొమరుని చెంతకు నడిపించు ||మా|| ||2||
3. వ్యాధుల బాధలు తీర్చెదనీవు
దేవుని దయను పొందిన మాతవు
పాపము నెరుగని కరుణామయిని
ప్రభు సన్నిధికి చేర్చమ్మా ||మా||