Type Here to Get Search Results !

మది తలపులు తెరచి ( madhi thalapulu therachi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Gummadi Ratna Kishore 

Tune: unknown 

Music: Naveen M 

Album: లాలనుచు పాడరే 6 


ప. మది తలపులు తెరచి మలినమ్ములు విడచి

నా హృదినే కానుకగా నీకీయ తలచి ||2|| 

ప్రభు పూజ అర్చనలో .... 

ప్రభు పాద సన్నిధిలో

అంకితమవ్వాలని అరుదెంచితి దేవా ||2|| 


1. నీది కానిదేమున్నది ఈ జగతిలో 

నీకీయగ ఏమున్నది నీ చేతన హృదిలో ||2|| 

నా కున్న సర్వమూ నీదే ప్రభువా ||2|| 

నీ వొసగిన అణవణువూ నీకే అంకితం ||2|| 

అదే నీకు ప్రియమని అదే మాకు వరమని ||2|| 

అంకితమవ్వాలని అరుదెంచితి దేవా ||2|| ||మ|| 


2. నీ కరుణ లేనిదే ఈ భూవిలో 

నిలువలేము క్షణమైన ఈ జీవనగతిలో ||2|| 

నీ ప్రేమే ఆధారం మా బ్రతుకులో ||2|| 

నీవు లేక క్షణమైన బ్రతుకలేము ఈ గతిలో ||2|| 

నీ ప్రేమే మార్గమని ఆ మార్గమే శరణమని ||2|| 

అంకితమవ్వాలని అరుదెంచితి దేవా ||2|| ||మ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section