Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. హల్లెలూయా - హల్లెలూయా
హల్లెలూయా - హల్లెలూయా
మానవుడు కేవలం రొట్టెవలననే జీవించడు
దేవుడు వచియించు
ప్రతి వాక్కు వలననే జీవించును
ఆలకించండి ప్రభువాక్యము
అనుసరించండి ప్రభుమార్గము
1. సువిశేష వాక్యము ఆలకించు
వాక్యానుసారము జీవించు
వాక్యపు వెలుగులో పయనించు
దేవుని ప్రతి వాక్కు ప్రకటించు
హల్లెలూయా - హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
2. మంచుకన్న తెల్లని వాక్యం
ఝుంటి తేనెల మధుర నీ వాక్యం
మారు మనస్సును ఒసగెడి వాక్యం
రక్షణ బాటలో నడిపే వాక్యం
హల్లెలూయా - హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా