Lyrics: Fr. Rayappa
Tune: unknown
Music: Dr. PJD Kumar
Album: అభిషేకాంజలి-3
ప. మదిలో యేసుని మధుర విందు
మహనీయులుగా మలిచే విందు
తన దేహముగా మార్చే విందు
తనలో ఏకం చేసేడి విందు ||2|| ||మ||
1. ఆబేలుని అర్పణ విందు
మెల్కిసేదేకుని యాజక విందు ||2||
అబ్రహాముని నడిపిన విందు
దివిని భువిని కలిపిన విందు ||మ||
2. మన్నా భోజన సుమధుర విందు
మానవాళికి రక్షణ విందూ ||2||
ఇజ్రాయేలును కాచిన విందు
దివిని భువిని కలిపిన విందు ||2|| ||మ||
3. శాశ్వత క్రీస్తు శరీర రక్తపు
శాశ్వత జీవం ఇచ్చెడి విందు ||2||
దివ్య భోజ్యముగా వెలసిన విందు
దివిని భువిని కలిపిన విందు ||2|| ||మ||
4. స్వస్థత మాకు ఒసగిన విందు
భక్తితో మమ్ము నిలిపిన విందు
శక్తితో మమ్ము నింపిన విందు
నిస్పృహనుండి బ్రోచిన విందు
దివిని భువిని కలిసిన విందు ||2|| ||మ||