Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మేడగదిలో శిష్యులందరిని
విందుకు పిలచి రొట్టెను విరచి 2
ఇది నా శరీరము ఆరగించుడని
ద్రాక్షారసపాత్రము ఆ ప్రభు రుధిరమని
పానము చేసిన పావనులగునని
పలికెను ప్రభుయేసు మేడ
1 వ చరణం..
జీవాహారము నేనే అనుచు
జీవజలమును తానే అనుచు
పూజావేళలో బలి అర్పణయై
పాపవిమోచన చేయగ ప్రభువు
మన్నాకన్నామిన్నగ నున్న
కనివిని ఎరుగని కమ్మని విందులో
దీనుల ఆకలి తీర్చును నేడు మేడ
2 వ చరణం..
పితదేవునికి దూరమాయిన
ఆదాము సంతతిన్ బ్రోవగనెంచి
తన దేహమును శిలువన మోపి
వేయి ధారలుగ రుధిరము చింది
కరుణతో దీనుల దాహము తీర్చెను
జీవపు ఊటగా మారెను విందులో
దీనుల ఆకలి తీర్చును నేడు మేడ