Lyrics: Fr. YesuPadam Teneti
Music/Tune: Kala Praveen
Album: క్రీస్తు స్వరామృతం
ప. ఆ...... ఆ..... ఆ...... ఆ......
మధురం మధురం మన ప్రభుని విందు
మనకై ఏ తెంచిన పరమ విందు
మనసారా పొందుము
ఆత్మానందపు విందు ||2||
మానవాళిని ఐక్యము చేసే
నిత్యానందపు విందు ||2||
కో. ప్రభురాత్రి భోజనము ఆఖరి విందు
ప్రభుని రుధిర శరీరముల స్మరణ విందు
1. ఐదువేల మందికి పంచిన అద్భుత విందు
అప్ప ద్రాక్ష రసముల అర్పణ విందు ||2||
అనురాగాన్ని పంచే అమర ప్రేమ విందు
ఆత్మను పంపే అపురూప విందు ||2|| ||మ||
2. మంచిని పెంచిన పావన విందు
మానవుల దోషాలను దహించు విందు ||2||
మనతో ఉంటానన్న ఆ ప్రభుని విందు
మనకోస మిచ్చిన రక్షణ విందు ||2|| ||మ||