Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. మధురవర ప్రసాదమా
మానవాళి భోజ్యమా
ఉన్నతుడైన దేవుని
ప్రేమామృతమైన అప్పమా ||మ||
1. స్రవించెడి రక్త ధారయై
వ్రేలాడిన దివ్య దేహమై
నిత్య రక్షణ నొసగు సిలువయై
మృత్యుంజయుని ముగ్ధ రూపమైన ||మ||
2. జీవదాతగు ప్రభు హస్తమై
నిత్యవెలుగు నిచ్చు జ్యోతియే
పరమ పథమును జేర్చు బాటయై
సేద దీర్చెడి దివ్య వృక్షమైన ||మ||
3. ఆదామవ్వల - పాపదోషాన దైన్య
మొందిన మానవాళిని
పరలోక పాత్రులను జేసిన
దేవ దేవుని దివ్య తనయుని ||మ||