Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఆ..ఆ..ఆ..ఆ.. లలలల
మధుర మధురమగు మహిమాన్వితుడగు
మరియ సుతుని విందు ||2||
మంజుల శ్రీకరుడే స్వయముగా అరుదెంచి
మమతలు విరజల్లె అమృత రసవిందు ||2||
ఆరగించ రండి స్వీకరించ రండి
1. జీవపు ఊటలు జల జల జారే
హృదిని చేరు విందు
యేసుని దేహం దానము చేయ
భువికి దిగిన విందు ||2||
క్షమను ఒసగు విందు కరుణ చూపు విందు ||2||
కలుషము బాపును కలతలు తీర్చును
పరమ దివ్య విందు ||2||
ఆరగించ రండి స్వీకరించ రండి ||2|| ||మధుర||
ఆహ ఆహ ఆహ లలలల
2. పావన రుధిరం గలగలపారే
ప్రేమ ఒసగు విందు
వరవాహినిలా అలసిన ప్రజలకు
సేదదీర్చు విందుఆ..ఆ..ఆ
శుద్ధమైన విందు పరిశుద్దుని ఈ విందు
రక్షణ ఇచ్చును స్వస్థత ఒసగును
పరమ ప్రేమ విందు ||2||
ఆరగించ రండి స్వీకరించ రండి ||2|| ||మధుర||