Type Here to Get Search Results !

మధురమె ఈ విందు ( madhurame ee vindhu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మధురమె ఈ విందు 

పరమాత్ముని వర విందు ||2|| 

ఆత్మల ఆనందము ఒసగె 

ప్రభు యేసుని అద్భుత విందు ||2|| 

జీవము తానై - వరము తానై 

జీవ జలములు తానై

భోజ్యము ఆయనె మనకు ||మధురమె|| 


1. ద్రాక్షావల్లిని నేనే అనుచు

నాలో తీగలు మీరనుచు ||2|| 

తనలో మనలను ఐక్యము చేసి 

ఫలింపచేయును ఈ విందు

జీవము తానై - వరము తానై 

జీవ జలములు తానై

భోజ్యము ఆయనె మనకు ||మధురమె|| 


2. పాపభారముతో అలసిన జనులకు

జీవము నిచ్చును ఈ విందు 

భయమును బాపి - శాంతిని కూర్చి 

పరమును చేర్చును ఈ విందు

జీవము తానై - వరము తానై 

జీవ జలములు తానై

భోజ్యము ఆయనె మనకు ||మధురమె|| 


3. చెదరిపోయిన గొర్రెల మందను

ప్రభు దరి చేర్చును ఈ విందు 

మలినమైన మన బ్రతుకును మార్చి

మోక్షము చూపును ఈ విందు

జీవము తానై - వరము తానై 

జీవ జలములు తానై

భోజ్యము ఆయనె మనకు ||మధురమె|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section