Lyrics: Fr. Dusi Devaraj
Tune: Fr. D.V. Prasad
Music: Dattatreya
Album: జీవశృతి - 1
మధురమైన యేసుని స్వీకరింప ఏగెదను
మమత మూర్తి క్రీస్తును - ఎదలో నిలుపు కొందును
1. మనసులోని కోర్కెలు - విన్నవింతు ప్రభునితో
ప్రభుని శరణు కోరెద - సన్నుతించి పాడెద ||మధుర||
2. పాపమెల్ల త్రుంచిన నాకు ముక్తి నిచ్చిన
పూజయందు దేవుని శిరము వంచి మ్రొక్కెద ||మధుర||
3. వెతలు ఎన్ని కల్గిన దేవా నిన్ను విడువను
నీవే నాకు ప్రాణము - జీవనాధారము ||మధుర||