Lyrics: Rajashree
Music/Tune: Dr. PJD Kumar
Album: సంగీతార్చన
సా. మధురం మధురం ఈ విందు
మధురాతి మధురం ప్రభువిందు
ప: మధురమైన విందు
ఇది సుమనోహర విందు
పరమ ప్రభునివిందు
ఇది పరలోకపు విందు ||2||
మధురం - మనోహరం
అమరం-అజరామరం ||2||
1. ఆబేలుని బలి అర్పణ విందు
మెల్కిసేదేకుని అర్చక విందు ||2||
సకల ప్రజలకు రక్షణ విందు
శాంతి శుభములు ప్రసాదించును ||2||
కో: మధుర విందు ఈ విందు
సుమధుర విందు ఈవిందు
2. ఎడారిలో నలువది యేండ్లు
ప్రజల నడిపిన అద్భుత విందు ||2||
మనల నడుపును ముక్తిమార్గమున ||2||
మోక్ష రాజ్యము ప్రసాదించును ||2||
కో: పరమవిందు ఈ విందు
ప్రభుని విందు ఈ విందు
3. ముక్తి నొసగును శక్తి నొసగును
మరియసుతుని మోక్షపు విందు
మనల బ్రోచును సేదదీర్చును ||2||
మహిమాన్వితుని అద్భుత విందు
కో: అమర విందు ఈ విందు
రక్షణ విందు ఈ విందు ||2||