Lyrics: Bishop Gorantla johannes
Tune: unknown
Music: Duggirala
Album: యేసులాలి - 3
ప. మధురమైన రాత్రి మరువలేని రాత్రి
క్రిస్మస్ రాత్రి ఇది క్రిస్మస్ రాత్రి
మానవ చరితను మార్చిన రాత్రి
దేవుడిల ధర కదలి వచ్చిన రాత్రి
క్రిస్మస్ రాత్రి ఇది క్రిస్మస్ రాత్రి
1. మానవునికై దైవము అరుదెంచే
మనుజ రూపుడై
మన మధ్యన వెలసే ||2||
మానవులు ఎంత ధన్యులో
దేవుని ఇల పొందగ ||మ||
2. ఆత్మ వరమై నిలిచెను మన ప్రభువు
చేరి దీనులై లోకొనగా జనులు ||2||
వర పుత్రులుగా జీవించే
భాగ్యము ఇలలో పొందగ ||మ||