Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. మధురమైన ఏసుని స్వీకరింప ఏగెదనూ||2||
మమత మూర్తిని క్రీస్తునూ
ఎదలో నిలుపు కొందునూ ||2||
1. మనసులోని కోర్కెలు
విన్నవించు ప్రభునితో ||2||
ప్రభుని శరణు కోరెదా
సన్నుతించి పాడెదా . ||2|| ||మ||
2. పాపమెల్ల బ్రోచెనూ నాకు ముక్తినిచ్చినా||2||
పూజయందు దేవునీ
శిరమువంచి మొక్కెదా ||2|| ||మ||
3. ఎదలు ఎన్ని కల్గినా
దేవ నిన్ను విడువనూ ||2||
నీవెనాకు ప్రాణమూ
జీవనాధారమూ ||2|| ||మ||