Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మధురాతి ఆహారం....కడరాత్రి భోజనం ll 2 ll
యేసు... దేహమే ఈ భోజనం
యేసు...రక్తమే ఆ దివ్య పానం ll 2 ll
రారండి... లోకోనుడి... నిత్యజీవం పొందండి ll 2 ll ll మధురాతి ll
1 వ చరణం
పశుల పాకలో ప్రభవించెను పరిశుద్ధమైన ఆహారం
దివినుండి భువికి అరుదెంచెను దివ్యమైన ఆహారం ll 2 ll
ఆ ...........ఆ ...........ఆ ..........
నేనే జీవాహారమని తననే యిచ్చిన మన ప్రభుని ll 2 ll
ప్రేమతో ....భక్తితో .....స్వీకరింపరే ....
రారండి... లోకోనుడి...... ll మధురాతి ll
2 వ చరణం
మన్న భోజనం మరుపించును మహోన్నతుని ఆహారం
ఆత్మ దాహం తీర్చును జీవము నిచ్చును ఆహారం ll 2 ll
ఆ ...........ఆ ...........ఆ ..........
నేనే జీవన పానమని (తన) హృదినే తెరచిన మన ప్రభుని ll 2 ll
ఆశతో ....ఆర్తితో .....స్వీకరించరే...
రారండి... లోకోనుడి ... ll మధురాతి ll