Lyrics: Fr. Dusi Devaraj
Tune: Fr. D.V. Prasad
Music: Dattatreya
Album: జీవశృతి - 3
మన తండ్రి దేవుని విందు
ఇది యేసుని స్నేహపు విందు
లోకొందము ఆ ప్రభు విందు
పాల్గొందము ఆనందమందు ||మన||
1. స్వర్గవాసులు కలిగిన విందు
ఇశ్రాయేలులు పొందిన విందు ||2||
ఆనాటి మన్నా విందు
నానాటి జీవపు విందు ||2|| ||మన||
2. కడరా రాత్రిని ఒసగిన విందు
శిష్యులందరు వేచిన విందు ||2||
అప్ప ద్రాక్షరసముల విందు
ఆత్మీయ రక్షణ విందు ||2|| ||మన||
3. ఆకలి తీర్చెడి అవసర విందు
లోటులు పూడ్చెడి భాగ్యపు విందు ||2||
మన ఆశ తీర్చెడి విందు
నవజీవన మిచ్చెడి విందు ||2|| ||మన||