Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మధువనిలో మహాదైవ విధానాలివే -
జలనిధిలో జీవ సుధల ప్రవాహాలివే
జీవన వేదమిదే - యేసుని బోధ ఇదే
అల్లెలూయ...అల్లెలూయ... అల్లెలూయ...అల్లెలూయ
1. శూన్యములో వెలుగు రేఖ ప్రకాశాలివే ||2||
భూమిపై చరాచర జీవరాశి మూల మిదే
కానా భూమి నిన్నే చేర్చిన మహారధి -
పాలు తేనెలన్నీ కూర్చిన ||2||
జీవరాశి ఇదే ఇదే
2. పాదములను నడుపు దీప ప్రభావాలివే ||2||
త్రోవలకు వెలుగు ఇదే దీనులకు మార్గమిదే
పాపదోషమంతా బాపినా దయానిధి -
మంచిబాట మమ్మే నడిపిన ||2||
ప్రేమవాణి ఇదే ఇదే