Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప మహి వెలసిన మహదేవుని
మనోజ్ఞమౌ మందిరమున
హృదయాంజలి హృదయాంజలి
మరియసుతుడు మనుజహితుడు
మనోహరుని మండపమున
ప్రేమాంజలి ప్రేమాంజలి
అందుకో శ్రీకరా - ఆదుకో శుభకరా||2||
1. నినుజేర మానవాళికోరిక
కనులార జూడ నీదు వేడుక ||2||
ధనధాన్యము ఫలపుష్పము
నీ రాజన మీయగా
ప్రేమమీర దివ్యపాద పూజ సేయగా
మనసైన కానుక-ముదమారమీయగా||2||
సాదరముగా స్వీకరించు జీవదాయకా ||2|| ||అ||
2. మరియాంబ మాకు మేటి నాయిక
మనుజాళి ముక్తిమార్గ దీపిక
మా స్వాస్థ్యము-సౌజన్యము
సౌభాగ్యము నీయగా
సాధ్వీమణి సౌహార్దము ధారపోయగా
నిజమైన సాక్షిగా - నైవేద్యమీయగా ||2||
సాదరముగ స్వీకరించు-శాంతిదాయకా ||2|| ||అ||