Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఆ..... ఆ....... ఉ..... రిసరిసరిస ....
ఉ ..... రిసరిసరిస
మహి వెలసిన మహదేవుని - మనోజ్ఞమౌ మందిరమున
హృదయాంజలి మరియ సుతుడు - మనుజహితుడు
మనోహరుని మండపమున - ప్రేమాంజలి ll 2 ll
అందుకో శ్రీకరా..... ఆదుకో శుభకరా.....
1 వ చరణం..
నినుజేరి మానవాళి కోరిక - కనులార జూడ నీదు వేడుక
ధన ధాన్యము ఫలపుష్పము - నీరాజన మీయగా
ప్రేమ మీర దివ్య పాద - పూజసేయగా
మనసైన కానుక - ముదమార మీయగా ll 2 ll
సాదరముగ స్వీకరించు- జీవదాయకాllఅందుకోll
2 వ చరణం..
మరియాంబ మాకు మేటినాయిక - మనుజాళి ముక్తి
మార్గ దీపిక మాస్వాస్థ్యము సౌజన్యము - సౌభాగ్యము నీయగా
సాధ్వీమని సౌహార్ధము - ధారపోయగా
నిజమైన సాక్షిగా - నైవేద్య మీయగా
సాదరముగ స్వీకరించు - శాంతిదాయకాllఅందుకోll