Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మహిమ ఘనతకు అర్హుడవు- నీవే నా దైవమా ll2ll
సృష్టికర్త ముక్తి దాత ll2ll
మా స్తుతులకు పాత్రుడా
ఆరాధనా నీకే ఆరాధనా నీకే ll2ll
ఆరాధన స్తుతి ఆరాధన- ఆరాధనా నీకే ll2ll llఆరాధనll
1 వ చరణం..
మన్నాను కురిపించినావు-
బండ నుండి నీళ్లిచ్చినావు
యెహోవా యీరే చూచుకొనును ll2ll
సర్వము సమకూర్చును ll2ll
2 వ చరణం..
అగ్ని మేఘస్తంభములోనుండి-
ఎడారిలో నడిపించినావే
యెహోవా రోహి- కాపరి నీవే ll2ll
దరి చేర్చు చున్నావు ll2ll
3 వ చరణం..
ఎర్ర సముద్రమును చీల్చినావు-
శత్రువు పై జయమిచ్చినావు
యెహోవా నిస్సి- విజయ ధ్వజము ll2ll
జయ శీలునిగా చేయును ll2ll
4 వ చరణం..
వ్యాధులను తొలగించి నావు-
మృతులను మరి లేపి నావు
యెహోవ రఫా- స్వస్థపరచును ll2ll
నను స్వస్థపరచును గా ll2ll
5 వ చరణం..
బలిపశువుగా మారినావు రక్తము చిందించి నావు
ఏసు నీవే నా రక్షకుడవు ll2ll
పరమునకు చేర్చుదువు ll2ll