Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మోక్ష ప్రకాశ రాణియా నిత్య పితా కుమార్తెయా
నీతి స్పిరుతు నేస్తమా నిర్మల సుతుని ఆలయమా ||3||
1. పరమ సంతోష కారణమా పరలోక ఆనందమా
ఉదయకాల నక్షత్రమా ఉచితమైన సంతోషమా
2. ఆశ్చర్యమైన పాత్రమా ఆశ్చర్యముగల పీఠమా
ఆనంద మహిమ ప్రకాశమా - ఆస్పదానికి మాతవా ||3||
3. పాపాత్ములకు శరణమా పరదేశులకు ఆదరువా
పాప నివారణ కొరకై పరాత్పరుని వద్ద వేడుకొనుమా ||3||
4. పూజ్యమై కన్యకాంబా పరిపూర్ణ ప్రియ తాత్పర్యమా
కన్నీరు కనుమయందు కరుణ వుంచి మమ్ము కావుమా ||3||