Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మేఘమల్లెరావా ! ఆత్మ దేవ రావా ! ||2||
ఆవరించగరావా ! ఆది దేవా రావా ! ||2||
మంచుజల్లువై రావా! మహిమ జల్లువై రావా!
1. కొండచరియల్లోని - తేనెవై రావా !
రాతి నేలలోని - తైలమై రావా !
జీవన దాతవై - జీవమివ్వగ రావా !
పరలోకనదివై-ప్రవహింపగరావా ! ||మేఘ||
2. మేఘ స్థంబమై మాకు-త్రోవ జూపగ రావా!
అగ్ని స్థంబమై మమ్ము - సేద దీర్చగ రావా!
ప్రేమ ధారవై మమ్ము - ప్రేమించగ రావా!
జీవధారవై రావా - ఆత్మ ధారవై రావా !
మేఘమల్లె రావా ! ఆత్మ దేవా రావా
మా చిరు జల్లువై రావా ! ||మేఘ||