Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ష మహోన్నతదేవుడా మహిమ కీర్తనం
భూలోకం వారికి సమాధానం ||2||
మీమహిమను పొగడెదము
మీ కీర్తన పాడెదము ||2||
ఓ పరం నాధుడా - ఓ లోకపాలకా ||2||
ఆరాధన ఘనతలను మీకర్పింతున్ ||2||
1. మహోన్నత క్రీస్తువా మహిమ కీర్తనం
మనుజ పాప విమోచక స్తుతి స్తోత్రముల్||2||
మీ సన్నిధి చేరితిమి-మీ దీవెన కోరితిమి||2||
ఓ పరం నాధుడా - ఓ లోకపాలకా ||2||
భయవేదన తొలగించుము లోకేశ్వరా||2||
2. ఓ పవిత్రాత్ముడా మహిమ కీర్తనం
ఓ దీన భాంధవ వేంచేయుమా ||2||
నీ ప్రేమను కురిపించి
నా జ్ఞానము తెరిపించి
ఓ శాంతి రూపుడా - ఓ దేవ కావరా||2||
నిత్యజీవ మహిమలను చూపించవా ||2||
ఆరాధన ఘనతలను మీకర్పింతున్..
భయవేదన తొలగించుము లోకేశ్వరా...
నిత్యజీవ మహిమలను చూపించవా
ఆ...ఆ...ఆ...మెన్-ఆ...ఆ...ఆ...మెన్