Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
1.మహెూన్నతము నందు దేవునికి మహిమా
మహిలోన మంచి - మనుజులకు శాంతి
ప్రభువైన దేవా - పరలోక రాజా
సర్వ శక్తి సంపూర్ణ పితయైన దేవా || మహా ||
2.మిమ్ము పొగడెద మేము - సన్నుతించెద మేము
ఆరాధనలు సలిపి ఘనపరచుచున్నాము
మీ వైభవము జూచి - వినుతించుచున్నాము
జనితైక పుత్రుడా జగమేలు క్రీస్తువా
ధరనేలు దేవుడా - పితయొక్క పుత్రుడా
పరమేశా పరిశుద్ధ - వరగొర్రెపిల్లా || మహా ||
3. పుడమి పాపములన్ని పరిహరించెడు వారా
దయ జూపి మమ్మెప్పుడు నాలకించండి
జగతి నఘములెల్ల పరిహరించెడు వారా
దయతో మా మనవి నాలకించండి
పితయొక్క కుడి ప్రక్క - కూర్చొని యున్నవారా
దయ జూపి మమ్మెప్పుడు నాదరించండి || మహా ||
4. ఏలయన మీరొక్కరే పరిశుద్ధులు
ఏలికగా మీరొక్కరే అధిపతులై యున్నారు
జగదేక పావన జగమేలు క్రీస్తువా
పితయైన సర్వేరా మితిలేని మహిమతో
పవిత్రాత్మతో కూడా పాలెంచెడి వారా || మహా ||