Type Here to Get Search Results !

మహోన్నతమున-మహా ( mahonathamuna - maha Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: నేనే నీవై 


ప. మహోన్నతమునా మహాదేవునికి మహిమా 

భూలోకమునా మంచివారికి సమాధానం ||2|| 


1. ఘనదేవా మా ఏలినవారా 

దివిలో వెలసిన మహరాజ ||2|| 

సర్వశక్తి గల పరమ పితా 

మిము స్తుతియించి ఘనపరచెదము 

ఆరాధనలు స్తుతి మహిమలు మీకే 

మహావైభవం ఘన ఆరాధనలు మీకే స్వామీ ||2|| 


2. జనితైకసుతుడా మనుజావతారా

దేవుని ప్రియమైన గొఱ్ఱపిల్లా ||2|| 

పిత యొక్క పుత్రుడ శ్రీ యేసా ||2|| 

మా పాపములు మన్నించు స్వామి 

పాపవిమోచక పరమ వైద్యులు 

మీరే పరమపవిత్రులు 

మహెూన్నతులు మీరే స్వామీ ||2|| 


3. మహాఘనతతో పిత కుడిప్రక్కన 

కూర్చొనియుండుట చూచుటకై ||2|| 

మా మనస్సులను మా హృదయములను 

కరుణలో బ్రోవ మిము వేడెదము ||2|| 

పితయగు దేవుని మహిమలో మీరు 

నిరతం ఆత్మయందు వసియించి 

పాలించెడి వారా ||మ|| 

ఆ........ఆ........ఆమెన్


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section