Type Here to Get Search Results !

మహోన్నతమున దేవునికి ( mahonathamuna devuniki Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మహోన్నతమున దేవునికి - మహిమని పాడుదాం 

భూలోకమున మనుజులకు - శాంతిని చాటుదాం ll 2 ll 


1 వ చరణం.. 

ఏలినవారా - పరలోక రాజా ......... 

పితయైన సర్వేశ్వరా - స్తుతియించి ఆరాధిస్తాంllమహోll 


2 వ చరణం.. 

ప్రేమ స్వరూపుడా - మీ వైభవమునకై 

కరుణా సాగరా - వందనం అర్పించెదంllమహోll 


3 వ చరణం.. 

తండ్రి దేవుడా - సృష్టికి కారకుడా 

ప్రియతమ తండ్రిగా - పొగడుతూ పాడుతాంllమహోll 


4 వ చరణం.. 

దేవుని గొఱ్ఱెపిల్లా - పాప విమోచకుడా 

పాపము పరిహారించి - దయచూపుమో దేవాllమహోll 


5వ చరణం.. 

పితయొక్క పుత్రుడా - కుడి ప్రక్క ఆసీనుడా 

పరిశుద్ధుడవు నీవే - మహోన్నతుడగు దేవాllమహోll 


6వ చరణం.. 

యేసు క్రీస్తువా - దైవ కుమారుడా 

మా మొరనాలించి - కరుణను చూపవాllమహోll 


7వ చరణం.. 

ఆత్మదైవమా - ప్రేమ దీపమా 

ఆపదవేళలా -మమ్మును కావుమా llమహోll 

ఆ..... ఆమెన్‌ - ఆ..... ఆమెన్‌ 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section