Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఏలినవారా దయచూపండి - క్రీస్తువా దయచూపండి
ఏలినవారా దయచూపండి - ఏలినవారా దయచూపండి
మహోన్నతమున - దేవునికి మహిమ
మంచి మనసున్న - వారికి సమాధానము
పరలోక భూలోకమందు - ఆనందము సంతోషము ||2||
1 వ చరణం..
పరలోక తండ్రి - మీకే స్తుతి మహిమ
మా పూజ్యతండ్రి - మీకే వందనము ||2||
నీవే మారాజువు - మీకే ఆరాధన ...
విశ్వమంతయు చేసినదేవా - దేవాదిదేవా ...
నీవేగా యిస్రాయేలు దేవుడవు ||2|| llమహోన్నll
2 వ చరణం..
మా యేసుదేవా - మీకే స్తుతి మహిమ
లోకాధినేతా - మీకే వందనము ||2||
నీవే మా క్రీస్తువు - మీకే ఆరాధన ....
లోకపాపం బాపిన యేసా - ఓ గొఱ్ఱెపిల్లా
మమ్ములను - ఆదరించి కాపాడు ||2|| llమహోన్నll
3 వ చరణం..
ఓ ఆత్మాదేవా - మీకే స్తుతిమహిమ
ప్రేమ స్వరూపా - మీకే వందనము ||2||
నీవే మా చైతన్యము - మాకిల ఆదరువు
విశ్వ శ్రీ సభలోన - విశ్వాసదీపమా ...
నీ ప్రియభావం చెదరనీయకు దేనా ||2|| llమహోన్నll
సాకీ.మీరే పరిశుద్ధులు - మీరే ఏలినవారు ...
మీరే మహోన్నతులు - పరిశుద్ధ త్రీత్వమా
మీకే స్తుతిమహిమ - ఆమెన్... ఆమెన్... ఆమెన్...