Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
కో:
గ్లోరియా...గ్లోరియా... గ్లోరియా... ఇనేక్సల్సిస్ దేయో
పల్లవి:..
మహోన్నతమున – పరమ దేవునికి మహిమ
మహిమా... మహిమా... మహిమా... ||2||
భూలోక ప్రజలకు శాంతి సమాధానము ||2||
కో:..
గ్లోరియా...గ్లోరియా... గ్లోరియా... ఇనేక్సల్సిస్ దేయో
1 వ చరణం..
ఏలిన వారైన సర్వేశ్వరా – పరలోక మాతండ్రీ
సర్వశక్తి గల దేవా – పితయైన మా ప్రభువా
మిమ్ము ఘన పరచెదం – మిమ్ము స్తుతించెదం
మిమ్ము పొగడెదము – మిమ్మారాధించేదం ||2||
కో:..
గ్లోరియా...గ్లోరియా... గ్లోరియా... ఇనేక్సల్సిస్ దేయో
2వ చరణం..
జనితైక సుతుడా ఓ యేసా.... ఈ లోక రక్షకుడా
లోక పాప పరిహారకుడా – దేవుని గొర్రెపిల్ల ||2||
మిమ్ము ఘన పరచెదం – మిమ్ము స్తుతించెదం
మిమ్ము పొగడెదము – మిమ్మారాధించేదం ||2||
కో:..
గ్లోరియా...గ్లోరియా... గ్లోరియా... ఇనేక్సల్సిస్ దేయో
3వ చరణం..
మీ రోక్కరే పరిశుద్ధులు – ఓ మహోన్నతుడా
పిత దేవ సుతుడా మా క్రీస్తువా – పవిత్రాత్మ సర్వేశ్వరా ||2||
మిమ్ము ఘన పరచెదం – మిమ్ము స్తుతించెదం
మిమ్ము పొగడెదము – మిమ్మారాధించేదం ||2||
కో:..
గ్లోరియా...గ్లోరియా... గ్లోరియా... ఇనేక్సల్సిస్ దేయో ||2||
ఆమెన్.... ఆమెన్.... ఆమెన్....