Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
గ్లోరియా గ్లోరియా గ్లోరియా గ్లోరియా ||2||
మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ - మహిమ
మహిమ - మహిమ మహిమ - మహిమ
భూలోకమున మంచి మనస్సు కలవారికి
శాంతి - శాంతి సమాధానము .
||మహోన్నతమున||
1. ప్రభువైన సర్వేశ్వరా - పరలోక రాజా
సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా
మీకే మహిమ మీకే ఘనత
మీకే కీర్తి మీకే ఆరాధన ||గ్లోరియా - గ్లోరియా||
2. పిత యొక్క పుత్రుడా - కుడిప్రక్క ఆసీనుడా
లోకపాపములు - పరిహరించువారా
మీరే మా దయ - మీరే మా మనవి
మీరే రక్షణ - మీరే సర్వస్వము
||గ్లోరియా - గ్లోరియా||
3. పరిశుద్ద ప్రభు క్రీస్తువా మహోన్నతులు మీరే
పిత మహిమలో పవిత్రాత్మతో నుండువారా
ఆమెన్ - ఆమెన్ ఆమెన్ - ఆమెన్ ||2||
ఆమెన్ - ఆమెన్ ||2||