Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మహోన్నతమున సర్వేశ్వరునికి
మహిమస్తుతి స్తోత్రము
భువియందు మనుజులకు ఆనందము
శాంతి సమాధానము ||2||
1. ఏలినవారైన సర్వేశ్వరా
పరలోక మా ప్రభువా
సర్వాధిపతియైన సర్వేశ్వరా
భువినేలు మా పాలకా
మిమ్ము పొగడెదం
మిమ్ము స్తుతియించెదం
మహిమ స్తుతి స్తోత్రము ||2||
2. జనితైక సుతుడా మా క్రీస్తువా
మా పాప పరిహారక
సర్వేశ్వరుని-ఓ గొఱ్ఱపిల్లా
మా మీద దయచూపవా
పితదేవా సుతుడా శ్రీయేసువా
మహిమ సుత్తి స్తోత్రము
3. పిత కుడిప్రక్కన ఆసీనుడా
పరిశుద్ధ శ్రీ యేసువా
మా కనులు తెరచి రక్షించుమా
మమ్మెపుడు దీవించుమా
పరిశుద్దులు మీరు పరిపూర్ణులు
మహిమ స్తుతి స్తోత్రము
4. పిత మహిమలో పరిశుద్ధాత్మతో
వసియించు మా క్రీస్తువా
మీరొక్కరే మా ఏలినవారు
మీరే మహోన్నతులు
అర్పింతుము ఈ స్తుతి గానము
మహిమ స్తుతి స్తోత్రము ఆ.. ఆమెన్