Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మహెూన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము
భువియందు మనుజులకు ఆనందము శాంతి సమాధానము ||2||
1. ఏలినవారైన సర్వేశ్వరా - పరలోక మా ప్రభువా
సర్వాధిపతియైన సర్వేశ్వరా - భువినేలు మా పాలకా
మిము పొగడెదం - మిము స్తుతియించెదం - మహిమా స్తుతి స్తోత్రము
2. జనితైక సుతుడా - మా క్రీస్తువా - మా పాపపరిహారక
సర్వేశ్వరుని ఓ గొఱ్ఱపిల్లా - మా మీద దయచూపవా
పితదేవ సుతుడా - శ్రీ యేసువా మహిమా స్తుతి స్తోత్రము
3. పితయొక్క కుడి ప్రక్క ఆశీనుడా - పరిశుద్ధ శ్రీయేసువా
మా కనులు తెరచి రక్షించుమా - మమ్మెప్పుడు దీవించుమా
పరిశుద్దులు మీరు పరిపూర్ణులు - మహిమా స్తుతి స్తోత్రము
4. పిత మహిమలో పరిశుద్ధాత్మతో వసియించు మా క్రీస్తువా
మీరొక్కరే మా ఏలినవారు మీరే మహెూన్నతులు
అర్పింతుము ఈ స్తుతి గానము మహిమా స్తుతి స్తోత్రము
ఆమెన్....ఆమెన్... ఆ..ఆ... ఆమెన్.