Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ
భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము.
ఏలినవారైన సర్వేశ్వరా! పరలోక రాజా!
సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా!
మిమ్ము స్తుతియించుచున్నాము
మిమ్ము నారాధించుచున్నాము.
మిమ్ము ఘనపరచుచున్నాము -
మీ మహ వైభవమునకై మీకు వందనములర్పించుచున్నాము -
జనితైక పుత్రుడా! ఏలినవారైన జేసుక్రీస్తువా! -
ఏలినవారైన సర్వేశ్వరా!
సర్వేశ్వరుని గొఱ్ఱెపిల్లా! -
పితయొక్క పుత్రుడా!
లోకము యొక్క పాపములను పరిహరించెడివారా! మాకు దయచూపండి.
లోకము యొక్క పాపములను పరిహరించెడివారా! మా మనవి నాలకించండి
పితయొక్క కుడి ప్రక్కన కూర్చొనియున్నవారా! మాకు దయచూపండి -
ఏలయన, మీరొక్కరే పరిశుద్ధులు, మీ రొక్కరే ఏలినవారు,
మీరొక్కరే మహోన్నతులు, జేసుక్రీస్తువా! -
పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా! - ఆమెన్.