Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రభువా దయ చూపుము
క్రీస్తువ దయచూపుము ||2||
ప్రభువా దయచూపుము ||2||
గ్లోరియా... గ్లోరియా... గ్లోరియా...
గ్లోరియా... ||2||
మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ
భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి
1. ప్రభువైన సర్వేశ్వరా - పరలోక రాజా
సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా
నిన్ను పొగడుచున్నాము
నిన్ను స్తుతించుచున్నాము
నిన్నారాధించుచున్నాము
నిన్ను కీర్తించుచున్నాము
నీ మహా వైభవమునకై
నీకు వందనములర్పించుచున్నాము ||మహోన్నతమున||
2. జనితైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా...
ప్రభువైన సర్వేశ్వరా - సర్వేశ్వరుని
గొర్రెపిల్లా పితయొక్కపుత్రుడా
||నిన్ను పొగడు||
||మహోన్నతమున||
3. లోక పాపములను పరిహరించు ప్రభువా
మాకు దయచూపుము
లోక పాపములను పరిహరించు ప్రభువా
మా మనవిని ఆలకింపుము పితకుడి ప్రక్కన కూర్చొనియున్న ప్రభువా మాకు దయ చూపుము
||నిన్ను పొగడు||
||మహోన్నతమున||
4. ఏలయన నీవు మాత్రమే పవిత్రుడవు
నీవు మాత్రమే ప్రభుడవు
నీవు మాత్రమే మహోన్నతుడవు
యేసుక్రీస్తువా
పితయైన సర్వేశ్వరుని మహిమలో
పవిత్రాత్మతో నుండు ప్రభువా ...
ఆమెన్ - 6 ఆమెన్ - 6